Sankranthi : బుధవారం తిరుగు ప్రయాణమయితే ఇక అంతే.. ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేం
సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం తిరిగి సొంతూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి బయలుదేరుతుంటారు
సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం తిరిగి సొంతూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి బయలుదేరుతుంటారు. అయితే మంగళవారం నాడు కనుమ కావడంతో బుధవారం అందరూ బయలుదేరే అవకాశముంది. ఒక్కసారిగా మళ్లీ జాతీయ రహదారిపై రద్దీ పెరిగే అవకాశముంది. మంగళవారం కనుమ పండగ కావడంతో ఎవరూ బయలుదేరరు. బుధవారం అందరూ ఒక్కసారిగా గ్రామాల నుంచి సొంత వాహనాలలో బయలుదేరారంటే మరొక్కసారి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
వెళ్లేటప్పుడు...
సంక్రాంతి పండగకు వెళ్లేటప్పుడు కాస్త అటూ ఇటుగా బయలుదేరినా అప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కొన్ని లక్షల వాహనాలు ఇప్పటికే హైదరాబాద్ నుంచి గ్రామాలకు బయలుదేరి వెళ్లాయి. అయితే పండగ మంగళవారంతో పూర్తి కావడంతో అందరూ బుధవారం బయలుదేరడానికి సాధారణంగా ప్లాన్ చేసుకుంటారు. అయితే అందరూ ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి వస్తే మళ్లీ ట్రాఫిక్ జాం కాక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వచ్చి ట్రాఫిక్ సమస్యలో ఇరుక్కోవద్దని కూడా సూచనలు వినిపిస్తున్నాయి.
వచ్చే టప్పుడు...
అదే సమయంలో వర్క్ ఫ్రం హోం వెసులు బాటు ఉన్నవాళ్లు గురు లేదా శుక్రవారాల్లో తిరుగు ప్రయాణం అయితే మంచిదన్న సూచనలు అందుతున్నాయి. టోల్ గేట్ల మీదనే కాకుండా జాతీయ రహదారిపై ఎక్కువగా మరమ్మతులు జరుగుతుండటంతో అక్కడ కూడా ట్రాఫిక్ సమ్యలు ఎక్కువయ్యే అవకాశముందని చెబుతున్నారు. అందుకే పండగ కోసం వెళ్లిన వారు ఎంజాయ్ చేసి.. తిరుగు ప్రయాణంలో మాత్రం ఇబ్బంది పడవద్దని, గురు, శుక్రవారాల్లో బయలుదేరడం బెటర్ అని చెబుతున్నారు.