పాల్వాయి స్రవంతికే మునుగోడు టిక్కెట్

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.;

Update: 2022-09-09 07:32 GMT

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి టిక్కెట్ దక్కలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థుల పేర్లను పరిశీలించింది.

మూడు పేర్లను పరిశీలించి...
ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఒక ఏడాది మాత్రమే ఉన్న కాలపరిమితి ఉన్న ఈ పోస్టుకు ముగ్గురు పోటీ పడినా అన్ని రకాలుగా ఆలోచించి పాల్వాయి స్రవంతి పేరును అధినాయకత్వం ఖరారు చేసింది. టిక్కెట్ కోసం పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి పోటీ పడ్డారు. అయితే వీరిలో పాల్వాయి స్రవంతి వైపు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపింది.


Tags:    

Similar News