Kondagattu : కిటకిటలాడుతున్న కొండగట్టు

హనుమాన్ జయంతి కావడంతో ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Update: 2024-06-01 06:38 GMT

హనుమాన్ జయంతి కావడంతో ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కూడా సాధ్యం కావడం లేదు. మంచినీరు దొరకడం కూడా కష్టంగా మారింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు, అధిక సంఖ్యలో భక్తుల కొండగట్టుకు తరలి రావడంతో నీరు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

మాల వేసుకున్న వారితో...
హనుమాన్ జయంతి రోజున దర్శించుకునే భక్తులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో కొండగట్టుకు చేరుకున్నారు. హనుమాన్ దీక్ష విరమణ కోసం పెద్ద సంఖ్య మాల వేసుకున్న వారు వచ్చారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా మారడంతో ఆంజనేయ స్వామి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. భక్తులను త్వరితగతిన దర్శనానికి పంపుతున్నా అధిక సంఖ్యలో భక్తులుండటంతో అధిక సమయం పడుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News