డేంజర్ బెల్స్...గోదావరి వరద

భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ప్రస్తుతం 52 అడుగుల మేర గోదావరి నీటి మట్టం చేరింది

Update: 2022-07-13 05:03 GMT

భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ప్రస్తుతం 52 అడుగుల మేర గోదావరి నీటి మట్టం చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సాయంత్రానికి 62 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ మేరకు అధికారులతో అత్యవసరం ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

రికార్డు స్థాయిలో...
జులై నెలలో ఇప్పటి వరకూ ఈ స్థాయి వరద రాలేదని స్ధానికులు చెబుతున్నారు. 2020లో 61 అడుగుల మేర నీరు చేరిందని అంటున్నారు. 1986లో 75.65 అడుగుల మేర వరద వచ్చిందంటున్నారు. భద్రాచలం వైపునకు 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో హైఅలెర్ట్ జారీ చేశారు.


Tags:    

Similar News