20 వేల నాణేలతో అయోధ్య రామ మందిరం.. భక్తిని చాటుకు తెలంగాణ భక్తుడు
Ayodhya Ram Temple: ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు అయోధ్యపైనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం అయోధ్యలో
Ayodhya Ram Temple: ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు అయోధ్యపైనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరుగనుంది. దీంతో దేశ విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. అయితే అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా కొందరు అయోధ్య ఆలయ నమూనాను బిస్కెట్స్, పూలు, బంగారం, వెండి, నాణేలతో తయారు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రామ నామమే ప్రాణమని నమ్మిన రామ భక్తుడు వినూతన ఆలోచనతో అయోధ్య మందిరాన్ని 20వేల నానాలను ఉపయోగించి 10అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో అత్య అద్బుతంగా అయోధ్య రామ మందిరాన్ని 3 రోజులు శ్రమించి తయారు చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ఇందులో అన్ని రకాల నానాలను ఉపయోగించి అయోధ్య చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.