జయసుధతో బీజేపీ మంతనాలు
సినీ నటి జయసుధతో భారతీయ జనతా పార్టీ మంతనాలు జరుపుతుంది. ఆమెను పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది.
సినీ నటి జయసుధతో భారతీయ జనతా పార్టీ మంతనాలు జరుపుతుంది. ఆమెను పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి జయసుధ విజయం సాధించారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత జయసుధ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 లో వైైసీపీలో చేరిన జయసుధ పెద్దగా యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులను కూడా రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తుంది.
ఈటల భేటీతో....
ఈ నేపథ్యంలోనే జయసుధతో బీజేపీ నేత ఈటల రాజేందర్ సంప్రదించినట్లు తెలిసింది. ఈ నెల 21వ తేదీన అమిత్ షా చౌటుప్పల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఆ సభలోనే ఎక్కువ చేరికలు ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇందుకోసమే జయసుధను ఈటల రాజేందర్ సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమె అందుకు అంగీకరించిందా? లేదా? అన్నది ఈరోజు, రేపట్లో తెలియనుంది.