కోమటిరెడ్డి ఇంటికి భట్టి... ఆయన ఏమ్మన్నారంటే?
తమది కాంగ్రెస్ కుటుంబమని, పార్టీ వీడే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని భట్టి విక్రమార్క తెలిపారు
తమది కాంగ్రెస్ కుటుంబమని, పార్టీ వీడే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని భట్టి విక్రమార్క తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ భట్టి విక్రమార్కతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. గతంలోనూ తాను 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారని ముందుగానే చెప్పానని అది నిజమయిందన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భట్టితో తాను ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఆయనతో తనకు ఉన్న సంబంధాలను బట్టి ఆయనతో మాట్లాడానన్నారు. బీజేపీ తెలంగాణలో బలపడుతుందని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వారికి పదవులు ఇవ్వలేదన్నారు.
వీడొద్దని చెప్పా....
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తామంతా కాంగ్రెస్ కుటుంబమని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిపోవద్దని తాను చెప్పానన్నారు. కోమటిరెడ్డికి సోనియా, రాహుల్ పట్ల గౌరవం ఉందన్నారు. సీఎల్పీ నేతగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడేందుకే వెళ్లానని చెప్పారు. తొందరపడవద్దని ఆయనకు తెలిపానన్నారు. అమిత్ షాను కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదని భట్టి విక్రమార్క తెలిపారు. కొంత అసంతృప్తి ఉన్న మాట నిజమేనని, అయితే పార్టీ వీడేంత ఉంటుందని తాను అనుకోవడం లేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు