21న అమిత్ షా సభ... బండి స్పష్టీకరణ

మునుగోడు సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు

Update: 2022-08-13 02:23 GMT

మునుగోడు సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారని ఆయన చెప్పారు. 21వ తేదీన సభ వాయిదా పడిందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

పలు తేదీలు సూచించినా...
మునుగోడు సభకు రావాలని అమిత్ షాను తాము కోరామన్నారు. ఈ నెల 21, 29 తేదీలతో పాటు సెప్టంబరు నెలలో మరో రెండు తేదీలను అమిత్ షాకు తాము సూచించామని చెప్పారు. అయితే అమిత్ షా మాత్రం ఈ నెల 21న బహిరంగ సభకు వచ్చేందుకు అంగీకరించారని బండి సంజయ్ తెలిపారు.


Tags:    

Similar News