అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత... బీఆర్ఎస్ అభ్యర్థికి గాయాలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణల కారణంగా బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు తీవ్రంగా గాయపడ్డారు

Update: 2023-11-12 02:15 GMT

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణల కారణంగా బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు తీవ్రంగా గాయపడ్డారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు ఎదురుపడిన సందర్భంలో బాలారాజుపై దాడి జరిగినట్లు చెబుతున్నారు. అయితే బాలరాజు తన వాహనంలో భారీగా డబ్బులు తీసుకెళుతున్నారన్న సమారచారంత కాంగ్రెస్ కార్యకర్తలు ఉపపునంతల మండలంలోని వెల్టూరు గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు.

డబ్బులు తరలిస్తున్నారని...
వాహనాన్ని బాలరాజు ఆపకపోవడంతో ఆయన వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడింాచరు. అచ్చంపేట్ లోని అంబేద్కర్ కూడలి వద్ద రాళ్లతో దాడులకు దిగారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. అయితే విష‍యం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడకు చేరుకున్నారు. అయితే ఈరాళ్లదాడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి.
అపోలోకు తరలింపు...
బాలరాజు నుదుటిపై గాయం కావడతో అచ్చంపేట్ లో ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉండి డబ్బులు తరలించేందుకు సాయపడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు సమాచారమిచ్చినా వారు అడ్డుకోకపోవడంతో కార్యకర్తలు వాహనాన్ని ఆపినా అడ్డుకోలేదని, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారని కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News