BRS : నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం
బీఆర్ఎస్ కీలక సమావేశం నేడు జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ్యుల సమావేశం జరగనుంది
బీఆర్ఎస్ కీలక సమావేశం నేడు జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ్యుల సమావేశం జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ బీఆర్ఎస్ శాసనభ్యులకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఈ సమావేశం జరగనుంది.
అసెంబ్లీ సమావేశాలకు...
ఈ సమావేశాలు కీలకంగా మారడంతో పాటు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో హాట్ హాట్ గా సాగే అవకాశాలున్నాయి. అక్రమ అరెస్టులు, హైడ్రా, మూసీ ప్రాజెక్టు వంటి ముఖ్యమైన అంశాలను సభలో చర్చించనున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చ జరిపేందుకు బీఆర్ఎస్ పట్టుబట్టాలని నిర్ణయించే అవకాశముంది.