Telangana : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్ వికెట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అయిపోయిందని హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన తెలిపారు.
ఏడాది పాలనలో...
ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేందేమీ లేదన్న హరీశ్ రావు కూల్చడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఒక్కటైనా నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధును బంద్ చేశారని, ఏ వర్గమూ ఏడాదిలో తెలంగాణలో సంతోషంగా లేరని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షాలు మీద విరుచుకుపడటం తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సంవత్సరకాలంలో పనిచేసింది ఏముందని ఆయన నిలదీశారు.