పింక్ బుక్ లో నోట్ చేసుకుంటున్నాం .. కవిత వార్నింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నేతలకు హెచ్చరించారు.;

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నేతలకు హెచ్చరించారు. తాము పింక్ బుక్ లో అన్ని పేర్లు నమోదు చేసుకుంటున్నామని, అధికారుల నుంచి రాజకీయ నేతల పేర్ల వరకూ నమోదు చేసుకుంటున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ కార్యకర్తలను, నేతలను వేధించిన వారిని వదిలపెట్టే ప్రసక్తి లేదని కవిత హెచ్చరించారు.
రజతోత్సవ సభకు...
వరంగల్ లో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని తెలిపారు. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదన్న కవిత బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదని ఎంఎల్సీ కవిత వ్యాఖ్యానించారు