బీఆర్ఎస్ ను మూడో సారి స్కీమ్ లు గట్టెక్కించేనా?

బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో ఎక్కువగా బీసీలే ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా బీసీ సామాజికవర్గం ఓట్లు ఉన్న నేపథ్యంలో వారిని తమతోనే

Update: 2023-05-29 04:04 GMT

telangana assembly elections

భారత రాష్ట్ర సమితి (BRS) అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు స్కీమ్ లతో ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటూ.. పలు పథకాలతో ప్రజలను ఆకర్షించడానికి ముందుకు వస్తోంది. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలలో సంక్షేమ పథకాలను పంపిణీ చేయడం, అమలు చేయడం ద్వారా తన ఓటు బ్యాంకును పెంచుకోడానికి ప్రయత్నం చేస్తోంది. రానున్న రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వర్గాలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తుంది, గృహ లక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు 3 లక్షల ఆర్థిక సహాయం, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి కేసీఆర్ ముందుకు వచ్చారు. ప్రస్తుతానికి కొందరికే ఈ పథకాలు దక్కినా.. రాబోయే రోజుల్లో ఎంతో మంది లబ్ధిదారులు ఇందులో భాగమయ్యేలా చూడనున్నారు.

జూన్ 24 నుంచి 30 వరకు పలు జిల్లాల్లో లబ్ధిదారులకు పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాల్గొంటారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో ఎక్కువగా బీసీలే ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా బీసీ సామాజికవర్గం ఓట్లు ఉన్న నేపథ్యంలో వారిని తమతోనే ఉంచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. 2014, 2018 ఎన్నికల్లో ఈ సామాజికవర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయా సామాజికవర్గాల మద్దతు తమకేనని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకోసమే వారి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకుని వస్తున్నారు. ఆ పథకాలే బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తాయని ఆశిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News