KTR : ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కాలేదు;
ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కాలేదు. తనను న్యాయవాదులతో కలసి విచారణకు అనుమతించాలని కోరారు. అందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. లిఖితపూర్వకంగా తాను చెప్పదలచుకున్న విషయాలను కేటీఆర్ ఏసీబీ అధికారులకు ఇచ్చారు.
న్యాయవాదులను అనుమతించకపోవడంతో...
తనకు న్యాయవాదులతో అనుమతించకపోతే తాను విచారనకు రాలేనని, న్యాయస్థానంలో తీర్పు రిజర్వ్ లో ఉన్న సమయంలో తనను విచారణకు పిలవడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను విచారణకు వచ్చినా న్యాయవాదులను అనుమతించకపోవడాన్ని ఆయన అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయన ఏసీబీ కార్యాలయం నుంచి బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now