KTR : కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇరువర్గాల వాదనలు విన్నహైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు చెప్పేంత వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.
ఇరు వర్గాల వాదనలు విన్న ...
కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై గతంలో జరిగిన విచారణ సందర్భంగా ఈ నెల 30వ తేదీ వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని, అయితే విచారణ చేసుకోవచ్చని తెలిపింది. ఈ కేసులో కేటీఆర్ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఒప్పందం చట్ట విరుద్ధమని ఎలా చెబుతారని, అది చట్ట వ్యతిరేకం ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం తరుపున ఏజీ తన వాదనలను వినిపించారు. ఒప్పందాలు కుదుర్చుకోక ముందే విదేశీ సంస్థలకు ఎలా డబ్బులు చెల్లిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఇరువర్గాలువాదనలు వినిపించిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి.