KTR : కేటీఆర్ కు నేడు నోటీసులు ఇచ్చే ఛాన్స్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. ఫార్ములా ఇ కారు రేసింగ్ కు సంబంధించిన కేసును ఏసీబీ నమోదు చేసింది. ఏసీబీ నుంచి వివరాలను తెప్పించుకున్న ఈడీ అధికారులు కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయనకు నేడు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
విచారణకు పిలిచి...
కేటీఆర్ ను ఇటు ఏసీబీ అధికారులు కూడా విచారణకు పిలిచే అవకాశముండటంతో ముందుగా నిధులు విదేశాలకు మళ్లించడంపై ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను పది రోజుల పాటు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం నోటీసులు ఇచ్చి విచారించే అవకాశముంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now