BRS : మానుకోటతో ముందడుగు.. బీఆర్ఎస్ అంటే బంజారా సమితి

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

Update: 2024-11-25 07:32 GMT

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ లో జరిగిన మహా ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ మానుకోటతో ముందడగు పడినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ అంటే బంజారా సమితి అంటూ ఆయన కొత్త భాష్యం చెప్పారు. అమాయకుల భూములను లాక్కుని ఎదురుతిరిగిన వాళ్లపై పోలీసు కేసులు పెట్టి జైల్లో పెట్టించడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. అనేక మంది త్యాగాలు చేసిన ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఢిల్లీ చుట్టూ తిరుగుతూ...
రేవంత్ రెడ్డి ఢిల్లీకి చుట్టు ప్రదిక్షిణలు చేయడమే సరిపోయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టడమేంటని ఆయన నిలీదీశారు. ఢిల్లీకి ఇన్ని సార్లు వెళుతున్న రేవంత్ రెడ్డి కనీసం రైతులతో మాట్లాడే సమయం లేదా? అని ప్రశ్నించారు. తాము దళితులకు, గిరిజనులకు అండగా ఉంటామని, వారి పక్షాన నిలుస్తామని తెలిపారు. అవసరమైతే వారికి న్యాయసాయం కూడా అందచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని మహబూబాబాద్ లో కేటీఆర్ ప్రకటించారు.


Tags:    

Similar News