భగభగ మండుతున్న ఎండలు
మార్చి నెలాఖరులోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది
మార్చి నెలాఖరులోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడి పోతున్నారు. మే నెల ఎండలు మార్చినెలలోనే కన్పిస్తున్నాయి. దీంతో ఎండల నుంచి కాపాడుకునేందుకు ప్రజలు సురక్షిత మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉపరితల ద్రోణి కారణంగానే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కారణమదే.....
నిన్న ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రతకు కారణం ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ద్రోెణి ఏర్పడింది. ఈ ప్రభావంతో పొడి వాతావరణం ఉంటుందని, అందువల్లనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.