చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు
ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పట్టణానికి వచ్చి వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై
క్యాసినో వ్యవహారంలో సంచలనం సృష్టించిన చీకోటి ప్రవీణ్ పేరు మరోసార తెరపైకి వచ్చింది. చీకోటి ప్రవీణ్ పై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి అనుమతి లేకుండా మంగళవారం (జులై4) గజ్వేల్ కు వచ్చి.. ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సిద్ధిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత తెలిపారు. పట్టణంలో రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆమె.. రెండురోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి, 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.
ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పట్టణానికి వచ్చి వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు వార్తను నమ్మొద్దని సీపీ శ్వేత సూచించారు. సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గజ్వేల్ లో ప్రశాంత వాతావరణం ఉందని, మున్ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని కోరారు. కాగా.. స్థానిక శివాజీ విగ్రహం వద్ద మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడంపై తీవ్రదుమారం రేగింది. విషయం తెలుసుకున్న స్థానికులు శివాజీ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.