Telangana : వెయ్యి కోట్ల కుంభకోణం... సోమేశ్ కుమార్ పై కేసు నమోదు
తెలంగాణలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పై కేసు నమోదయింది.
మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పై కేసు నమోదయింది. తెలంగాణలో గతంలో జరిగిన వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంలో ఆయనపై ఈ కేసు నమోదయింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందన్న అంచనాకు వచ్చారు. ఈ మేరకు పోలీసుల విచారణలో తేలింది.
వాణిజ్య పన్నుల శాఖ....
దాదాపు 75 కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడయింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఫిర్యాదు మేరకు సోమేశ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమేశ్ కుార్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.