Telangana : రైతు భరోసా నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది.

Update: 2024-05-08 01:53 GMT

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది.లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రెడీ అయింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించింది.

ఎన్నికల తర్వాతనే...
రైతుల బ్యాంకు అకౌంట్ లో రైతు భరోసా నిధులు పడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీ లోగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో రైతు భరోసా నిధులకు బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాత మాత్రమే ఈ నిధులను విడుదల చేయాలని కోరింది.


Tags:    

Similar News