Breaking : నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 3న ఉప ఎన్నిక జరగనుంది

Update: 2022-10-03 06:38 GMT

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయనుంది. నవంబరు 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఆరోతేదీన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

కోమటిరెడ్డి రాజీనామాతో...
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఆయన బీజేపీలో చేరి ఈ ఎన్నికలో బరిలోకి దిగారు. కాంగ్రెస్ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. టీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశాలలోనూ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి.


Tags:    

Similar News