Breaking : డీజేపీ అంజనీకుమార్ సస్పెన్షన్
కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ కు దిగింది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది
కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ కు దిగింది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ఎన్నికల కోడ్ అమలులో ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడాన్ని తప్పు పట్టింది. ఆయన స్థానంలో అర్హత ఉన్న అధికారిని డీజీపీగా నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
షోకాజ్ నోటీసులు...
ఆయనతో పాటు వెళ్లి సంజయ్ కుమార్, మహేష్ భగవత్ లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రాజకీయ పార్టీ నేతలను కలవడాన్ని ఎన్నికల కమిషన్ తప్పు పట్టింది. అంజనీకుమార్ తర్వాత సీనియర్ గా రాజీవ్ రతన్ ఉన్నారు. కొత్త డీజీపీని మరికొద్ది సేపట్లో చీఫ్ సెక్రటరీ నియమించనున్నారు.