తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు.. కారణం ఇదే

బిపర్‌జాయ్ తుపాను తీవ్ర రూపం దాల్చటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షలు, అధికార యంత్రాంగంతో నిరంతం అందుబాటులో..;

Update: 2023-06-14 10:49 GMT
amit shah telangana tour cancelled

amit shah telangana tour cancelled

  • whatsapp icon

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మరోసారి రద్దైంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను కారణంగా అమిత్ షా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు బీజేపీ వర్గం వెల్లడించింది. గడిచిన ఆరునెలల్లో అమిత్ షా పర్యటన రద్దవ్వడం ఇది నాల్గవసారి. తెలంగాణలో పర్యటనకు షెడ్యూల్ ఖరారవ్వడం.. అనివార్య కారణాలతో రద్దుకావడం జరుగుతోంది. ఈసారి పక్కాగా షా పర్యటన, బహిరంగ సభ జరుగుతాయని అనుకుంటున్న నేపథ్యంలో తుపాను కారణంగా పర్యటన రద్దుకావడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారు.

బిపర్‌జాయ్ తుపాను తీవ్ర రూపం దాల్చటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షలు, అధికార యంత్రాంగంతో నిరంతం అందుబాటులో ఉండి సహాయక చర్యల ఆదేశాలకు సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత కేంద్రమంత్రిగా అమిత్ షా పై ఉంది. ఆ పనుల్లో ఆయన బిజీగా ఉండాల్సి రావటంతో తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది. షా తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కావటం కూడా షెడ్యూల్ లో భాగంగా ఉంది. దీంట్లో భాగంగానే ప్రముఖ సినీ దర్భకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ తో కూడా సమావేశం కావాల్సి ఉంది. కానీ పర్యటన రద్దుతో ఈ సమావేశాలు కూడా క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తోంది.


Tags:    

Similar News