కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు;

Update: 2025-02-17 04:17 GMT
revanth reddy, chief minister, greetings, kcr
  • whatsapp icon

నేడు కేసీఆర్ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను జరుపుతున్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్నదానాలతో పాటు రక్త దాన శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను జరపనున్నారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేయనున్నారు.

సేవా కార్యక్రమాలతో...
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News