Revanth Reddy : అంజనీకుమార్ యాదవ్ కు రేవంత్ స్వీట్ వార్నింగ్
మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంచిని మైకులో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలని మరిచిపోయిన మన నేతలు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యసభకు తాము యువతకు ప్రాధాన్యత ఇచ్చామంటే కష్టపడి పనిచేస్తేనే ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంజనీ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఇచ్చిన విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తుచేశారు.
యూత్ కాంగ్రెస్ లో...
యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వారికి ఎప్పుడైనా రాజ్యసభకు ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. అందుకే బయట మాట్లాడేటప్పుడు ఒకింత జాగ్రత్తగా మాట్లాడాలని, ఏదైనా ఇబ్బందులుంటే పార్టీ నాయకత్వానికి వచ్చి నాలుగు గోడల మధ్య చెప్పుకోవచ్చని, బహిరంగంగా అనడం సరికాదని అన్నారు. ఇటీవల అంజనీ కుమార్ యాదవ్ రేవంత్ రెడ్డి పక్కన అందరూ రెడ్లు ఉన్నారని, బీసీలను పట్టించుకోవడం లేదని ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఈ కౌంటర్ ఇచ్చినట్లు కనపడుతుంది.