Revanth Reddy : డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు

Update: 2024-08-28 06:04 GMT

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. పదేళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనకు నేడు శ్రీకారం చుట్టామన్నారు. పదేళ్ల పాలన చేపట్టిన వారు తెలంగాణ తల్లిని పట్టించుకోలేదన్నారు. వారే తెలంగాణ సర్వస్వం అన్నట్లు వ్యవహరించారన్నారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ పేరు మీద గది ని నిర్మించుకుని బయటకు రాకుండా, ఎవరికీ ప్రవేశం లేకుండా చేశారన్నరు. ఈరోజు ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామని తెలిపారు. సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ వంటిదని, ఇక్కడి నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాల్సి ఉందన్నారు.

సచివాలయంలో భూమి పూజ...
ప్రజలకు సచివాలయంలో నిషేధం విధించారన్నారు. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేలా తాము చేశామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి గత పాలకులకు మనసు రాలేదన్నారు. ఇక్కడ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ సహకారంతో రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలిపే విధంగా విగ్రహాన్ని రూపొందిస్తామని తెలిపారు. డిసెంబరు 9వ తేదీన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని ప్రకటించినందున ఆరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News