Breaking : హైడ్రా కూల్చివేతలపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
హైడ్రా కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు
హైడ్రా కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. కోకాపేట లో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించే ప్రకృతి సంపదను రక్షిస్తున్నామని తెలిపారు. చెరువులను చెరబెట్టిన వారిని వదలబోమని ఆయన హెచ్చరించారు. చెరువులను కబ్జా చేసిన వారి భరతం పడతాం అని రేవంత్ రెడ్డి వార్నింగ్ హెచ్చరించారు.
ఎవరినీ వదిలపెట్టం...
రాజకీయ నేతలు చెరువుల స్థలంలో ఫాం హౌస్‌లను నిర్మించుకుని వారి డ్రైనేజీ నీటిని హిమాయత్ సాగర్, గండిపేటలో కలుపుతున్నారన్నారు. దీనివల్ల తాగు నీరు కలుషితం అవుతుందని చెప్పారు. ఆ పాపాన్ని సవరించడానికే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. చెన్నై, వాయనాడ్ లో ఆ పరిస్థితులను మనం చూశామని తెలిపారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి స్ఫూర్తి భగవద్గీత అని రేవంత్ రెడ్డి అన్నారు. చెరువులన్నింటినీ శుద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.