Revanth Reddy : నా బ్రాండ్ ను నేనే క్రియేట్ చేసుకున్నా
తాను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నిస్తున్నానో అందరూ అడుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
తాను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నిస్తున్నానో అందరూ అడుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెల్ల బియ్యం పంపిణీ చేస్తే ఎన్టీఆర్, హైదరాబాద్ ఐటీ కంపెనీలంటే చంద్రబాబు, ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు గుర్తుకు వస్తారని అన్నారు. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఏ బ్రాండ్ లేదంటూ అనేక మంది తనను అడుగుతున్నారని, తనకు యంగ్ ఇండియా బ్రాండ్ ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్రణాళికలను రచించడమే పాలకుల ముందున్న లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎయిర్ ఇండియా స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
యంగ్ ఇండియా స్కూల్ ...
యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్ అని రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు పిల్లల చదువులపై తమ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టిందన్న రేవంత్ రెడ్డి పేదలు చదువుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి వాటిని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. విధినిర్వహణలో పడి పోలీసులు తమ పిల్లల చదువులపై దృష్టి పెట్టలేరన్నారు. యంగ్ ఇండియా స్కూల్ లో చేరిన వారికి వంద శాతం మందికి ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ప్రీ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యావిధానంలో సమూలమైన మార్పులు తెచ్చి ఉపాధి అవకాశాలు దక్కేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.