Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.;

Update: 2025-01-15 01:57 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. ఏఐసీసీ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

పార్టీ పెద్దలతో సమావేశం...
అనంతరం పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి అక్కడే సమావేశమవుతారని తెలిసింది. ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణపై ఆయన చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. దీనిపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు విస్తరణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనిపై నేడ క్లారిటీ వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News