Hyderabad Rains: హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందా?

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం

Update: 2024-11-02 02:32 GMT

HyderabadRains

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మేఘాల విస్పోటం జరిగిందా అన్నట్లుగా కొద్దిసేపు హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది. పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ప్రయాణికులు కూడా భారీగా చిక్కుకుపోయారు.

అరగంట వ్యవధిలో కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలిలో అత్యధికంగా ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, చందానగర్‌లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపల్లి, బోరబండ, హఫీజ్‌పేట, బాలాజీనగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌లో కూడా వర్షం కురిసింది. పలు కాలనీలు కూడా జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. నిజాంపేట్, మేడ్చల్, ఖైరతాబాద్, మలక్ పేట్, మియాపూర్, కొండాపూర్, మూసాపేట్, మెహెదీపట్నం, కేపీహెచ్ బీ కాలనీ, దుండిగల్, కండ్లకోయ, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, చార్మినార్, మల్లంపేట్, బోయిన్ పల్లి, కృష్ణాపూర్, మణికొండ, హైటెక్ సిటీ, బేగంపేట, గండి మైసమ్మ, లింగపల్లి, మాదాపూర్ ప్రాంతాలు భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.


Tags:    

Similar News