నిర్మల్ కు కేసీఆర్.. భారీ బహిరంగ సభ

నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో సుమారు 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల..

Update: 2023-06-04 03:44 GMT

cm kcr visits nirmal district

సీఎం కేసీఆర్ నేడు నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన ఇంటిగ్రెటెడ్ కలెక్టరేట్ భవనాన్ని, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో సుమారు 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ విధానంలో రూ.56 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త కలెక్టర్ ను కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ సముదాయానికి నిరంతర విద్యుత్ ను అందించేందుకు ప్రత్యేక సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

నిర్మల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రమంగా గులాబీ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కలెక్టరేట్ కు వెళ్లే దారిపొడవునా భారీ ప్లెక్సీ కటౌట్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో 5 వేలమంది పోలీసులతో భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. నలుగురు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 300 మంది సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు. సాయంత్రం సుమారు లక్షమందితో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో నేతలు జనసమీకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. సభకు వచ్చేవారికి రవాణా సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు.





Tags:    

Similar News