ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అమలు చేయబోతున్న 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం

Update: 2024-02-26 14:47 GMT

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అమలు చేయబోతున్న 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీం గురించి కొందరిలో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే!! అయితే ఇది నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు రాలేదంటూ ఎవరూ ఆందోళన పడొద్దని.. ఎవరికైనా ఏ కారణంగా అయినా గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ రాకపోతే అలాంటి వారు మండల కేంద్రంలోని ప్రభుత్వ అధికారులకు సంప్రదించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమలులో పేదలకు న్యాయం చేయటం ముఖ్యమని తెలిపారు. ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉండే వాళ్లకు ఇవ్వలేం కదా అంటూ విలేకరులను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు ద్వారా పేదలను గుర్తించి అర్హులకే పథకాలు అమలు చేస్తున్నామన్నారు.


Tags:    

Similar News