నేడు రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం
నేడు కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు;

నేడు కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, భూ భారతి పోర్టల్, సన్న బియ్యం పంపిణీ వంటి అంశాలపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన కల్పించనున్నారు. ఈ పథకాలతో ప్రజలకు ఉపయోగపడనున్నాయో వివరించనున్నారు.
పథకాలను...
ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ఈ పథకాల గురించి వారికి వివరించాలని, ప్రభుత్వం అమలు చేసే పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రి వర్గ విస్తరణపై చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందులు కలగచేస్తున్నాయని, ఏదైనా ఉంటే అధినాయకత్వానికి చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి సూచించనున్నారు.