కేసీఆర్ కు రేవంత్ విషెస్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు;
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని తెలిపారు. ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ప్రతిపక్షనేతగా...
ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి దోహదం చేయాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలని, ఆయన మరింత కాలం తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని తమ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.