బాధ్యతలను స్వీకరించిన సీవీ ఆనంద్
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ బాధ్యతలను స్వీకరించారు
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ బాధ్యతలను స్వీకరించారు. ఆయన అంజనీకుమార్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. అంజనీకుమార్ ను ఏసీబీ డీజీగా బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రభుత్వం సీీవీ ఆనంద్ ను నియమించిన సంగతి తెలిసిందే.
శాంతిభద్రతలను...
ఈరోజు అంజనీకుమార్, సీవీ ఆనంద్ లు ఇద్దరూ తమ కు కేటాయించిన పోస్టుల్లో బాధ్యతలను తీసుకున్నారు. హైదరాబాద్ వాసులకు శాంతి భద్రతల ఇబ్బంది లేకుండా చూస్తానని సీవీ ఆనంద్ చెప్పారు. అందరి సహకారంతో హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేస్తానని తెలిపారు.