అలర్ట్.. ఓఆర్ఆర్ పై రెండు మార్గాలు మూసివేత
గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడకు వెళ్లే ఎదులనాగులపల్లి వద్ద ఎగ్జిట్ నెంబర్ 2, శామీర్‌పేట సమీపంలోని ఎగ్జిట్ నెంబర్ 7 నుండి..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అల్లాడుతున్న తరుణంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరం చుట్టూ ఉండే.. ఔటర్ రింగ్ రోడ్డులోని రెండు ఎగ్జిట్ లను మూసివేశారు. ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 7 లను మూసివేశారు.
గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడకు వెళ్లే ఎదులనాగులపల్లి వద్ద ఎగ్జిట్ నెంబర్ 2, శామీర్‌పేట సమీపంలోని ఎగ్జిట్ నెంబర్ 7 నుండి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శామీర్ పేట్, మేడ్చల్ వైపుగా వెళ్లే మార్గాల్లో వరదనీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆయా మార్గాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన అప్‌డేట్‌లను సకాలంలో ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ మార్గాలను మూసివేయడంపై.. హైదరాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజు స్పందించారు.
“మూసీ నది ఎగువన ఉన్న రెండు ట్యాంకుల నుండి వరద విడుదలపై దృష్టిసారించాలని అభ్యర్థించారు. మూసీ ఒడ్డున నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, పోలీసు అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండూ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.