Yadadri : యాదాద్రికి పోటెత్తతున్న భక్తులు... పెరుగుతున్న ఆదాయం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆదాయం కూడా పెరుగుతోంది;
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం జరిగాక భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుంది. యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మారిందనే చెప్పాలి. ఇక వీకెండ్ లో తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు యాదాద్రి చేరుకుంటున్నారు.
నెల రోజుల్లో...
కొత్త ఆలయాన్ని చూసేందుకు వస్తున్న వారు కొందరు కాగా, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు మరికొందరు తరలి రావడంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గత ఇరవై ఎనిమిది రోజుల్లో యాదాద్రికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. పది హేను కోట్ల రూపాయలు 28 రోజుల్లో రాగా, వంద గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండి వచ్చింది.