ఈడీ ఎదుట కవిత చెప్పిన సమాధానాలివే : ధర్మపురి అరవింద్

కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు సహకరించలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు;

Update: 2023-03-12 12:28 GMT
ఈడీ ఎదుట కవిత చెప్పిన సమాధానాలివే : ధర్మపురి అరవింద్
  • whatsapp icon

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు సహకరించలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 9 గంటల విచారణలో ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ ఈడీ అధికారులు ప్రశ్నిస్తే ఏమో.. నాకు తెలియదు.. నాకు గుర్తు లేదు.. అంటూ సమాధానమిచ్చారని అన్నారు. తనకు ఈ రకమైన సమాచారం అందిందన్నారు. కవిత ప్రమేయం లేకుంటే ఎందుకు విచారణకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బండి వ్యాఖ్యలను సమర్ధించను...
నిజామాబాద్ ధర్మపురి అరవింద్ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని ధర్మపురి అరవింద్ తెలిపారు. అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదన్నారు. కేవలం కో - ఆర్డినేషన్ సెంటర్ మాత్రమేనని ఆయన అన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని అన్నారు.


Tags:    

Similar News