తెల్లవారుజామున టెన్షన్ పడిపోయిన వరంగల్ ప్రజలు
వరంగల్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆగస్టు 25వ తేదీ శుక్రవారం
వరంగల్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆగస్టు 25వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 4:43 గంటలకు భూకంపంవచ్చింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. భూ కంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూకంపం సంభవించిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోపల కదలికలు సంభవించినట్లు ప్రకటించింది.
వరంగల్‌కు తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో, 30 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. ఇది సరిగ్గా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర సంభవించినట్లు NCS ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. స్వల్ప భూకంపం కావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటివరకు భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.