ఈటల రాజేందర్ కు కీలక పదవి దక్కనుందా?

ఎన్నికలు అతి దగ్గరలో ఉన్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడానికి మొగ్గు చూపడం లేదు. అలా చేస్తే పార్టీలో చీలికలను బహిర్గతం చేసే అవకాశం ఉందని

Update: 2023-05-22 06:16 GMT

తెలంగాణ బీజేపీలోని కీలక నేతల మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ హైకమాండ్ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తోంది. రాబోయే ఎన్నికలకు సంసిద్ధంగా ఉండేలా బీజేపీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. అంతర్గత సవాళ్లను పరిష్కరించడానికి హైకమాండ్ అసమ్మతివాదుల మధ్య చర్చలు నిర్వహిస్తోందని అంతర్గత వర్గాల సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ యూనిట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగు రోజుల క్రితం జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో చర్చలు జరిపారు. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతల గురించి కూడా చర్చించారు. పార్టీ కోసం కట్టుబడి ఉన్న ప్రభావవంతమైన నాయకులతో కూడిన ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోందని రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రచార కమిటీ చైర్మన్‌గా రాజేందర్‌ను నియమించే అవకాశం ఉండగా, మరికొందరికి ఉపాధ్యక్షులు, సభ్యులుగా స్థానం కల్పించే అవకాశం ఉంది. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పలువురు నేతలు బీజేపీ హైకమాండ్‌ను కోరారు.

ఈ దశలోనూ.. ఎన్నికలు అతి దగ్గరలో ఉన్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడానికి మొగ్గు చూపడం లేదు. అలా చేస్తే పార్టీలో చీలికలను బహిర్గతం చేసే అవకాశం ఉందని హై కమాండ్ భావిస్తూ ఉంది. రాష్ట్రం ఎన్నికలకు సన్నద్ధమవుతున్నప్పుడు హైకమాండ్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని, బదులుగా నాయకుల మధ్య అంతరాలను తగ్గించడంపై ద్రుష్టిపెట్టింది. ప్రణాళికలకు అనుగుణంగా ఆయా నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పార్టీ తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తుల స్పందన అస్పష్టంగానే ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేందర్‌ను నియమించాలని కొందరు నేతలు డిమాండ్ చేయగా, హైకమాండ్ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పార్టీలో కొత్తగా చేరిన రాజేందర్‌ను బీజేపీ చీఫ్‌గా నియమిస్తే మాత్రం ముందు నుండి బీజేపీలో ఉన్న వాళ్లతో విబేధాలు రావడం కూడా పక్కాగా కనిపిస్తోంది. త్వరలోనే తెలంగాణ బీజేపీలో కూడా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Tags:    

Similar News