తెలంగాణలో టెన్త్ పరీక్షలకు షెడ్యూల్ సిద్ధం
మే 9వ తేదీ నుంచి 12వ తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలకానుంది. మే 9వ తేదీ నుంచి 12వ తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ పరీక్షల షెడ్యూల్ ను నేడో, రేపో వెల్లడించే అవకాశముంది.
మే 11వ తేదీన....?
ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. మే 11 లేదా 12 తేదీల్లో పదో తరగతి పరీక్షలను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు అధికారులు ప్రకటన చేసే అవకాశముంది.