Telangana : ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.;

తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్లు గడువు ముగియడంతో స్క్రూటినీ చేసిన ఎన్నికల అధికారులు అధికారికంగా ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం...
కాంగ్రెస్ బలపర్చిన సీపీఐకి చెందిన సత్యం కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఒక స్థానానికి బీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ ఒక్క స్థానంలో బీఆర్ఎస్ దాసోజుశ్రావణ్ ను బరిలోకి దింపింది. నామినేషన్లు పరిశీలించిన అధికారులు అన్ని సక్రమంగానే ఉండటంతో పాటు పోటీ లేకపోవడంతో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయినట్లు అధికారులు తెలిపారు.