సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. బస్సుకు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఎమర్జెన్సీ స్విచ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో మంటలు బస్సుకు అంటుకున్నాయి. అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది.. పక్కనే ఉన్న బస్సులను దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
Also Read : BIGG BOSS TELUGU OTT : హోస్ట్ నాగార్జున కాదా ?
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి మంటలార్పే సరికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు విలువ రూ.3 కోట్ల వరకూ ఉంటుందని అధికారుల అంచనా. కాగా.. ఎమర్జెన్సీ స్విచ్ లో మంటలు ఎందుకొచ్చాయన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా ? లేదా హై ఓల్టేజీ వల్ల మంటలు చెలరేగాయా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.