కవిత లేఖకు ఈడీ స్పందన ఏంటంటే?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించారు.

Update: 2023-03-09 02:50 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించారు. ఎల్లుండి విచారణకు హాజరయ్యేందుకు ఓకే చెప్పారు. ఈ మేరకు కవితకు ఈ మెయిల్ ద్వారా కవితకు సమాచారం పంపారు. రేపు జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ధర్నా చేస్తుండటంతో తనకు ఈరోజు విచారణకు హాజరయ్యేందుకు వీలులేదని, ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమం కావడంతో ఈ నెల 11న హాజరవుతానని కవిత తెలిపారు.

బీఆర్ఎస్ టీం...
అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఓకే చెప్పారు. ఈ నెల 11న కవిత ఈడీ అధికారుల ఎదుట ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై విచారణకు హాజరయ్యే అవకాశముంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కవితకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారని తెలిసింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీమ్ కవితకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News