KCR : నేడు రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు.;

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఆయన ఈ సమావేశలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
వరంగల్ లో జరగనున్న...
ఈ నెల 27న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేలా నేతలందరూ సమిష్టిగా కృషిచేయాలని ఆయన చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా బాధ్యతలను తీసుకుని అక్కడి కార్యకర్తలను జాగ్రత్తగా సభవద్దకు తీసుకు రావడం, మళ్లీ ఇంటికి క్షేమంగా చేరుకనేంత వరకూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పదే పదే నేతలకు చెబుతున్నారు.