అవమానాలను ఎదుర్కొన్నా : పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఏడున్నరేళ్లుగా తాను అనేక అవమానాలకు గురయ్యాన్నారు.

Update: 2023-01-31 03:27 GMT

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఏడున్నరేళ్లుగా తాను అనేక అవమానాలకు గురయ్యానని తెలిపారు. మధిర నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఆవేశంగా ప్రసంగించారు. అధికారం ఎవరి సొత్తు కాదని ఆయన అన్నారు. 2018లో తాను వైసీపీ గుర్తుపైన ఎంపీగా గెలిచినా అప్పటి టీఆర్ఎస్ లోకి వెళ్లానని, కానీ తనకు. తనతో పాటు వచ్చిన అనుచరులకు అన్యాయమే జరిగిందని ఆయన ఆవేదన చెందారు.

తనతో పాటు...
2018 ఎన్నికల్లో కొందరు అభ్యర్థుల ఓటమి తన ఖాతాలో జమ చేసి తనను ఇబ్బంది పెట్టే యోచన చేశారన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, స్వయంకృతం కారణంగానే వారు ఓటమి పాలయినా తనకు ఆ ఓటమిని అంటగట్టడమేంటని ఆయన ప్రశంసించారు. సిట్టింగ్ ఎంపీని అని చూడకుండా కనీసం తనకు తిరిగి టిక్కెట్ ఇవ్వలేదన్నారు. తనపై ఆంక్షలు విధించారని చెప్పుకొచ్చారు. ఇన్ని అవమానాలతో బీఆర్ఎస్ లో పనిచేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.


Tags:    

Similar News