జూన్ 8 నుంచి 10 వరకూ తెలంగాణలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా మూడురోజులపాటు ఫిష్ ఫుడ్..

Update: 2023-05-18 05:35 GMT

telangana fish food festival

జూన్ నెలలో 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్టు తెలంగాణ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా మూడురోజులపాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. మృగశిరకార్తెను పురస్కరించుకుని మూడురోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్వయం ఉపాధి కోసం మత్స్యకార మహిళలకు చేపలతో చేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఈ ఫెస్టివల్ లో 20-40 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని సన్మనించనున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News