ఖమ్మంజిల్లాలో పెద్దపులి సంచారం.. ఆందోళనలో ప్రజలు

తాజాగా పులి అడుగుజాడలు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి అడుగులతో పాటు..

Update: 2022-01-30 11:52 GMT

ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలంలో పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని పాత కారాయి గూడెం గ్రామ సమీపంలోని వరి పొలంలో ఫారెస్ట్ అధికారులు పెద్దపులి అడుగులను గుర్తించారు. రెండ్రోజులుగా నీలాద్రి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి.. ఇప్పుడు జాతీయ రహదారిని దాటి జనావాసాల సమీపంలో సంచరిస్తోంది.

తాజాగా పులి అడుగుజాడలు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి అడుగులతో పాటు.. ఫెన్సింగ్ కు అంటుకున్న దాని జుట్టును గుర్తించారు. పాత కారాయి గూడెం గ్రామానికి సమీపంలో ఉన్న చీకటి రామయ్య మామిడి తోటకు వేసిన ఫెన్సింగ్ కు పెద్దపులి వెంట్రుకలున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గ్రామస్తులు ఆందోళన చెందవద్దని.. త్వరలోనే పెద్దపులిని పట్టుకుంటామని అధికారులు చెప్తున్నారు.


Tags:    

Similar News