Revanth Reddy : నేడు షాద్ నగర్ కు రేవంత్ రెడ్డి
తె. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాద్ నగర్ లోని కొందరుర్గులో ఈ ఇంటిగ్రేటడె్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.;

Revanth Reddy
తెలంగాణాలో నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈరోజు 28 శాసనసభ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ప్రయోగాత్మకంగా శంకుస్థాపన చేసయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాద్ నగర్ లోని కొందరుర్గులో ఈ ఇంటిగ్రేటడె్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఈ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన...
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేస్తారు. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న స్కూల్ కొందుర్గు శివారులో 20 ఎకరాలు ఈ స్కూల్ కోసం కేటాయించింది. పేదలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించి వారికి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ స్కూల్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.